ప్రభన్యూస్: కరోనాపై పోరాటంలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ సూచలన మేరకు తక్షణ చర్యలకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికల్లా 18 ఏళ్లు పైబడిన వారందరికీ కనీసంగా ఒక్కడోసు టీకా లక్ష్యాన్ని చేరుకోవాలని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సంకల్పించింది. సంక్షేమ పథకాలకు టీకాకు ముడిపెట్టింది. నవంబర్ 8వ తేదీన విడుదల చేసిన ఆదేశాల మేరకు, రేషన్ లబ్ధిదాలంతా తప్పని సరిగా రెండు డోసులు టీకా తీసుకోవాల్సి ఉంటుంది.
లేదంటే వారికి రేషన్‌ను నిలిపివేస్తామని సూచించింది. లబ్దిదారులు ప్రొటోకాల్స్ పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలించాల్సిన బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించింది. ఎవరైనా మొదటి లేదా రెండవ డోసు తీసుకోనిపక్షంలో వారికి రేషన్ నిలిపివేసి, సమీపంలోని ఆస్పత్రిలో టీకా తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. కాగా కొద్దిరోజుల ముందు సింగ్రౌలి కలెక్టర్ వివాదాస్పద ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్ 15 నాటికి టీకా తీసుకోని వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికార యంత్రాంగాని కి ముందస్తు ఆర్డ ర్ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily