Saturday, November 16, 2024

ఆఫీసుల్లో మొబైల్‌ ఫోన్లు వాడొద్దు.. మద్రాస్‌ హైకోర్టు ఆదేశం..

తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వ సిబ్బంది పనివేళల్లో కార్యాలయాల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్‌ ఫోన్లను ఉపయోగించొద్దని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన నియమావళిని రూపొందించాలని మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రమణియమ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

కాగా తిరుచిరాపల్లిలో హెల్త్‌ రీజనల్‌ వర్క్‌షాప్‌ విభాగంలో సూపరింటెండెంట్‌ ఆఫీసులోని సహ ఉద్యోగులను వీడియో తీశాడు. వీడియో తీయవద్దని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.దీంతో హైకోర్టును ఆశ్రయించగా అతడి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో మొబైల్‌ ఫోన్స్‌ను వ్యక్తిగత కార్యాలకు ఉపయోగించడంపై అసహనం వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారుల అనుమతితో కార్యాలయాల బయటకు వెళ్లి మాట్లాడుకోవాలని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement