Saturday, November 23, 2024

గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదన ఏదీ అందలేదు.. కేంద్ర ప్రభుత్వ వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ సహా ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాల ఏర్పాటుకు నిబంధన ఉందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం దేశంలో రెండు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయని వివరించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్న కేంద్రమంత్రి, అవసరాన్ని బట్టి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణీత ప్రమాణాలు ఏమీ లేవని ఆయన జవాబులో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement