Sunday, November 17, 2024

కరోనాతో ముప్పు లేదు.. న్యూ ఇయర్.. సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు లేవ్.. డీహెచ్ శ్రీనివాసరావు

ఇండియాలో పలు రాష్ట్రాల్లో బీఎఫ్-7 కేసులు నమోదవుతోన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాల్సిందగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అప్రమత్తమైంది. కరోనా టెస్టు శాంపిల్స్‌ను జీవోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని నిర్ణయం తీసుకుంది. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు ఎలాంటి కరోనా ఆంక్షలు విధించడం లేదని స్పష్టం చేశారు. కరోనా పట్ల ఇండియాలో ఎలాంటి సమస్య లేదని, వేడుకలు జరుపుకోడానికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

చైనాలో విజృంభిస్తున్న ఓమిక్రాన్ సబ్ వేరియంట్లను గతంలోనే మనం ఎదుర్కొన్నామని, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని శ్రీనివాసరావు సూచించారు. కరోనా వల్ల ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలపై ఎలాంటి ఆంక్షలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవని, ప్రభుత్వానికి కూడా తాము ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షలు విధించనున్నామని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రజలు యాథావిధిగా వేడుకలు జరుపుకోవచ్చని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement