Tuesday, September 17, 2024

N Convention | తీర్పు వచ్చే వరకు ఊహాగానాలు వద్దు : నాగార్జున

హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ అక్రమ కట్టడమని పేర్కొంటూ.. హైడ్రా అధికారులు కూల్చి వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌పై, అక్కినేని నాగార్జునపై తీవ్ర విమర్శలు, వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున మరోసారి స్పందించారు.

ఎన్‌ కన్వెన్షన్‌ విషయంలో వస్తున్న వదంతులు నమ్మొద్దంటూ అక్కినేని నాగార్జున అభిమానులు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఎన్-కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం, నిర్మాణ చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయస్థాన తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను’’ అని అక్కినేని నాగార్జున చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement