హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎవరికైనా ప్రమోషన్ అంటే ఎగిరి గంతేస్తారు. హోదా కోసం ఎంతదూరమైన వెళతారు. కానీ వైద్య, ఆరోగ్యశాఖలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాంధీ హాస్పిటల్‌లో చాలాకాలంగా పనిచేస్తున్న వైద్యులకు పదోన్నతులు కల్పించి ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. అయితే వారు ప్రమోషన్ వచ్చినా బదిలీ అయిన చోటుకు పోకుండా గాంధీలోనే డ్యూటీ చేస్తున్నారు.
గాంధీ కార్డియో విభాగాధిపతితోపాటు మరో అయిదుగురు వైద్యులు ఇటీవల బదిలీ అయ్యారు. అయితే వారు ఇంకా గాంధీ నుంచి రిలీవ్ కాలేదు. ప్రమోషన్లు వచ్చినా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్ట పడటంలేదు. హైదరాబాద్ నగరాన్ని విడిచి ఉండలేమని, తమకు ప్రమోషన్లు అవసరం లేదని వారు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.