Saturday, November 23, 2024

కర్పూరం, లవంగం, ఓమతో ఆక్సిజన్ పెరుగుతుందా?

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అందరూ ఆరోగ్యంగా వుండాలంటే వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.  అయితే, కర్పూరం, లవంగం,  ఓమ, యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం, రాత్రి సమయంలో వాసన చూడడం ద్వారా.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయట. లడఖ్‌లోని పర్యాటకులకు తమ ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి ఈ విధంగానే చేస్తారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే, ఇందులో నిజం లేదని నిపుణులు అంటున్నారు. కర్పూరం, లవంగం,  ఓమలతో ఆక్సిజన్ లెవెల్స్ పెరగవని చెబుతున్నారు. ఇళ్లల్లో కర్పూరం, లవంగం, ఓమలను తరచుగా వాడుతుంటాం. ఇవి జలుబు, దగ్గు, తదితరాలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అయితే, ఇవి కోవిడ్ 19 లాంటి మహమ్మారికి విరుగుడుగా పని చేస్తాయన్న ఆధారాలు ఎక్కడా లేవని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement