Tuesday, November 19, 2024

రాజ‌కీయాల‌కు దూరం… దూరం – సినిమాలే ప్రాణంః గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్

హైదరాబాద్‌: యువ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రానున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ తరఫున గోషామహల్‌ నుంచి ఆయన పోటీ చేయనున్నారంటూ ప్రచారం సాగింది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సంగీత రంగంలోనే కొనసాగాలనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.


”నేను రాజకీయాల్లో రావడం లేదు. రానున్న ఎన్నికల్లో గోషామహల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నానంటూ గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఒక ఆర్టిస్ట్‌గా జీవితాంతం ప్రతిఒక్కరికీ వినోదాన్ని అందించాలనుకుంటున్నా. సంగీత రంగంలోనే కొనసాగుతూ.. పరిశ్రమకు మరింత సేవ చేయాలనుకుంటున్నా. నన్ను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదు. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి” అని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement