Monday, November 25, 2024

పోలవరం ముంపుకు శాశ్వత పరిష్కారం లేదా? సమీపంలోనే వర్షాకాలం.. ఆందోళనలో పోలవరం బాధితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలవరం ఎత్తుతగ్గించి బ్యాక్‌ వాటర్‌ ముంపుసమస్యను పరిష్కరించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌ కొంతమేరకు తాత్కాలికంగా పరిష్కారం అయినప్పటికీ శాత్వత పరిష్కారం లభించలేదు. పోలవరం రిజర్వాయర్‌ లేవల్‌ పై కేంద్ర జల సంఘం ఉమ్మడి సర్వేకు ఆమోదం తెలిపినప్పటికీ ఆమేరకు సర్వే పూర్తి కాకముందే పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేయడంతో తెలంగాణ నీటి పారుదల శాఖ కాస్త ఊపిరితీసుకున్నట్లు అయింది. అయితే పోలవరంతో తెలంగాణ భూ భాగం ముంపుకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ తో ఇప్పటికే భద్రాచలం, మారేడు, కిన్నెరసాని తో పాటు ఆరు వాగులతో సహా 8 అవుట్‌ ఫాల్‌స్లూయిస్‌ లకు సంబంధించిన ముంపు భద్రాచలాన్ని అతలాకుతలం చేసింది.

అనేక గిరిజన గ్రామాలు ముంపుకు గురయ్యాయి. తిరగ మరికొద్ది నెలల్లో వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముంపును అరికట్టే చర్యలు తీసుకోవడంతో పాటుగా ముంపుగ్రామాలకు కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ కు కేంద్రం కంటి తుడుపు చర్యలే ప్రారంభించిందే కానీ శాశ్వత చర్యలు చేపట్టలేదు. అయితే గురువారం పార్లమెంట్‌ లో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 41. 15 మీటర్లకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించిందేకానీ పోలవరం ఎత్తు తగ్గించడం కానీ, ముంపు గ్రామాల సమస్యలపై స్పందించకపోవడం విచారకరం.

- Advertisement -

పార్లమెంట్‌ లో వైసీపీ పార్లమెంట్‌ సభ్యురాలు సత్యవతి అడిగిన ప్రశ్నకు సామాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయకమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తొలిదశ 20.946 కుటుంబాలకు సహాయ పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. అయితే తెలంగాణ ముంపుపై ఆయన చెప్పకపోవడంతో పాటు అనేక గ్రామాల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా మంత్రి స్పందనలేదు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేవలం 11, 677 నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాసం కల్పించినట్లు తెలిపారు. కేంద్రం తెలంగాణ ముంపుగ్రామాల సమస్యలపై స్పందించకపోవడంపట్ల జలనిపుణులు విచారం వ్యక్తం చేశారు.

అయితే పోలవరం ప్రాజెక్టుకోసం ఇప్పటికే 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఆంధ్రలో భూసేకరణ జరిగినప్పటికీ తెలంగాణ లో ముంపు ఆసేకరణకు దాదాపుగా సమానంగా ఉన్నా నష్టపరిహారం, ముంపు గ్రామాల పునరావాసం పై కేంద్రం స్పదించలేదు. అయితే పోలవరం అథారిటీ ఆధ్వర్యంలో సీడీబీసీ నిర్వహించే ఉమ్మడిసర్వే నివేదికల అనంతరం కేంద్రం తెలంగాణ ముంపుపై స్పందించే అవకాశాలున్నప్పటికీ ప్రస్తుతం 45.72మీట్లనుంచి 41.15 మీటర్లు తగ్గించినంతమాత్రాన తెలంగాణ ప్రాంతాల్లోని ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement