చాలా రోజుల గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి నటిస్తోన్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఈ మూవీలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. కాగా ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి నోనోనో అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ నీ స్నేహం, నీ మోహం.. నీ బంధం, అనుబంధం.. ప్రేమించే సమయం లేదే.. ప్రేమన్నా ప్రశ్నే లేదే.. అని సోలో లైఫ్ బెటర్ అంటూ స్టైలిష్‌గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎంఎం మానసి పాడారు.కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి 20 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏళ్ల మహిళగా కనిపించబోతుంది. సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement