Wednesday, January 8, 2025

Delhi | హెచ్‌ఎంపీవీ వైర‌స్ పై ఆందోళన వద్దు : కేంద్రం

దేశంలోకి వ్యాపించిన హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ వైర‌స్ కొత్తది కాదని 2001లో గుర్తించినట్లు నిపుణులు స్పష్టం చేసినట్లు తెలిపారు.

చైనాను క‌రోనా వైర‌స్‌లా వణికిస్తున్న ఈ వైర‌స్ మ‌న‌దేశంలో విస్త‌రిస్తుండ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ వస్తుందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో సోమవారం హెచ్‌ఎంపీవీ వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు.

- Advertisement -

2001లోనే ఈ వైరస్‌ను గుర్తించగా.. నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రపంచం మొత్తం ఇది వ్యాపిస్తోందని చెప్పారు. శ్వాసక్రియ ద్వారా గాలిలోకి హెచ్‌ఎంపీవీ వ్యాపిస్తుందని అన్నారు. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. శీతాకాలం, వసంత ఋతువు ఆరంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గమనిస్తున్నదని, ఆ నివేదికలను అందజేస్తుందని వెల్లడించారు.

కాగా, బెంగళూరులో ఇద్దరు శిశువులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక చిన్నారి, పశ్చిమ బెంగాల్‌లో ఒకరికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement