Saturday, November 23, 2024

వందశాతం ఫలితాలు అందితే బుజ్జగింపు అవసరం లేదు : మోడీ..

న్యూుఢిల్లి : ప్రభుత్వ పథకాలు నూరు శాతం ప్రజలకు అందితే సమాజంలో ఏ వర్గాన్నీ బుజ్జగించాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఆయన గురువారం గుజరాత్‌లోని బరౌచ్‌ జిల్లాలో నాలుగు ప్రభుత్వ పథకాల అమలుపై జరిగిన ఉత్కర్ష్‌ సమారోహ్‌ వీడియో లింక్‌ సమావేశంలో వర్చువల్‌గా ప్రసంగించారు.ఈ జిల్లాలో అధికార యంత్రాంగం అన్ని వర్గాల ప్రజలకు నాలుగు పథకాలను వందశాతం ప్రజలకు అందేట్టు చేసినందుకు అభినందనలు తెలిపారు.
ముఖ్యంగా వితంతువులు,వృద్ధులు,ఆపన్నులైన పౌరులకు ఆర్థిక సాయాన్ని అందించడంలో ఈ జిల్లా వంద శాతం వృద్దినిసాధించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య వివక్షను తొలగించడానికి ఈ పథకాలు ఎంతో తోడ్పడుతున్నాయని ఆయన అన్నారు. కొన్ని వర్గాలను బుజ్జగించే ధోరణి వల్ల రాజకీయాలు కలుషితం అవుతున్నాయని ఆయన అన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఫలాలు లబ్ధిదారులందరికీ చేరాలన్నది ప్రభుత్వ ధ్యేయమనీ, ఆ ధ్యేయంలోని స్పూర్తిని అర్థం చేసుకుని పథకాలను పకడ్బందీగా అమలు జేస్తున్న బరౌచ్‌ జిల్లా అధికారులను ఆయన అభినందించారు. పథకాల ఫలాలు వంద శాతం మందికి అందాయన్నది తృప్తి కోసం కాదనీ,అది ఒక ఆదర్శం కావాలని ఆయన అన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో తమ ప్రభుత్వం అదే లక్ష్యంతో పని చేస్తోందనీ, పేద వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ సుపరిపాలనకు చిరునామాగా మారిందని ఆయన అన్నారు.సంక్షేమ పథకాల అమలులో జిల్లా పాలనా యంత్రాంగాల్లో పోటీ తత్వం ఉంటాలనీ, అదే సందర్భంలో పారదర్శకతను పాటించాలని ప్రధానమంత్రి సూచించారు.

పరిమిత ప్రభావం..

తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు అమలు జరిగిన సామాజిక భద్రత, సంక్షేమ పథకాల ప్రభావం పరిమితమైనవనీ, వాటి ప్రయోజనం కూడా పరిమితమైనదేనని ఆయన అన్నారు. 2014 తర్వాత ఆ పథకాల పరిమితినీ, పరిధినీ తమ ప్రభుత్వం బాగా పెంచిందని ప్రధాని చెప్పారు. ఆరోగ్య పథకాలను తీసుకుంటే, గతంలో ఈ పథకాల వల్ల ప్రయోజనం పొందిన వారి పరిధి చాలాతక్కువనీ, తమ ప్రభుత్వం దేశంలో 50కోట్లమందికి ఉచిత చికిత్సలను అందిస్తోందని ఆయన చెప్పారు. అలాగే, అర్హులైన వయోవృద్దులకు పెన్షన్‌ పథకాన్ని అమలు జేస్తున్నామనీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకు మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టినట్టు ప్రధానితెలిపారు. గతంలో నిరుపేద వర్గాలకు ఇలాంటి సౌకర్యాలు అందుబాటులో లేవని ఆయన చెప్పారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించి ఇంతవరకూ ప్రభుత్వ పథకాల ఫలితాలు అందని వారికి ఆ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మకమైన రిీతిలోపథకాలను అమలు జేస్తోందని ప్రధాని చెప్పారు. అలాగే, గ్రామాల్లో సన్నగారు, మధ్యతరగతి రైతుల కుటుంబాలకు ఆర్థికసాయాన్నిఅందించే కార్యక్రమం సాగుతోందని ఆయన చెప్పారు.

లబ్ధిదారులతో ముచ్చట్లు..

ప్రధాని ఈ కార్యక్రమంలోప్రసంగించే ముందు లబ్దిదారులతోముఖాముఖీ జరిపారు.ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, వారు అందుతున్నాయని సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరిచ్చిన సమాధానాలకు ప్రధాని ఉద్వేగ భరితులయ్యారు. అన్ని వర్గాల ప్రజలకుప్రభుత్వంఅండగాఉంటుందనీ, సమాజంలో ఏ ఒక్కరూ తమకు సాయపడేవారెవరూ లేరన్న భావాన్ని దరిచేరనీయవద్దని ప్రధానిసూచించారు. ముఖ్యంగా వికలాంగులు, చూపులేని వారు, ఇతరబలహీనవర్గాలనుల ఆదుకునేందుకు ప్రభుత్వంఎల్లప్పడు సంసిద్ధం గా ఉందనీ, అంగవైకల్యం కలవారు, ఏ ఆధారం లేనివారు తమకు ఎవరూ లేరనే ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకోవాలని ప్రధాని హితవొసెగారు

- Advertisement -

మోడీ భావోద్వేగం..

ఈ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారుల్లో ఒకరైన ఆయూబ్‌ పటేల్‌ను మోడీ పలుకరించారు. అతడు రెండు కళ్ళూ కనిపించకచాలా బాధ పడుతున్నాడు. అతడి కుమార్తె ప్రధాని అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన తండ్రి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందనీ, ఈ పరిస్థితిని చూసిన తర్వాత తాను వైద్యవిద్యను అభ్యసించి కళ్ళు లేని వారికి సేవ చేయాలనుకుంటున్నాననీ, తన కుటుంబ నేపథ్యంఅందుకు సహకరించడం లేదని ఆమె చెప్పింది. సౌదీలో పని చేస్తున్నప్పుడు తన తండ్రి వేసుకున్న చుక్కల మందు కారణంగానే దృష్టి పోయిందని ఆమెచెప్పింది. పన్నెండవ తరగతి చదువుతున్న తాను పెద్ద డాక్టర్‌నైదృష్టిలేని వారికి దృష్టిని ప్రసాదించాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ప్రధాని ఒక్క క్షణం భావోద్వేగానికి గురై, నీ ఆశయమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుందని అన్నారు. ఆమె చదువుకు అవసరమైనప్పుడు సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement