ప్రభన్యూస్ : దేశీయ వాహన తయారీ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. డీజెల్ కార్ల తయారీ వైపు వెళ్లబోమని ప్రకటించింది. ఈ మేరకు సుజుకీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ మాట్లాడుతూ.. ఇప్పటికే డీజెల్ కార్ల సేల్స్ తగ్గుముఖం పట్టడంతో పాటు 2023 నుంచి తదుపరి దశ కర్బన్ ఉద్గారాల నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కర్బన్ ఉద్గారాల నియంత్రణ నిబంధనలు పాటిస్తూ.. డీజెల్ కార్లు తయారు చేయాలంటే.. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది కార్ల ధరల పెరు గుదలకు దారితీస్తుంది. దీంతో విక్రయాలు పడిపోతాయి. కొన్నేళ్లుగా కార్ల మార్కెట్ పెట్రోల్ కార్ల వైపు మళ్లుతోంది.
కస్టమర్ల నుంచి డిమాండ్ ఉంటే.. డీజెల్ కార్లను తయారు చేసే అంశాన్ని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునే వాళ్లం. కానీ ఇక ముందు డీజెల్ కార్ల తయారీ నుంచి పూర్తిగా వైదొలిగినట్టే. ప్రస్తుతం దేశీయంగా ప్యాసింజర్ వాహనాల్లో డీజెల్ కార్లు 17 శాతం లోపే. 2013-14 నుంచి భారీగా డీజెల్ కార్ల వాడకం తగ్గుముఖం పట్టింది. అంతకుముందు వరకు మొత్తం కార్ల సేల్స్‌లో 60 శాతం డీజెల్ కార్లు ఉండేవి. పెట్రోల్ వినియోగ కార్లలో మైలేజీ పెంపునకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital