ప్రపంచ వ్యాప్తంగా కరోానా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది…మళ్లీ థర్డ్ వేమ్ ముప్పు ముంచుకోస్తుందని నిపుణులు, డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఎంత చెప్పిన కొందరు నిబంధనలు పాటించడం లేదు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే మాస్కు లేకుండా ట్రైన్ ఎక్కిన ఓ యువకుడిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెయిన్ లోని లోకల్ మెట్రోలో జరిగింది ఈ సంఘటన. మాస్క్ లేకుండా మెట్రో ఎక్కిన వ్యక్తిని దిగిపోవాలని మొదట వారించారు ప్రయాణికులు..అయితే ఆ వ్యక్తి వారి మాటలను పట్టించుకోలేదు.. దీంతో ప్రయాణికుల్లోని ఇద్దరు మహిళలు మరింత ముందుకొచ్చి.. దిగాలంటూ ఆ వ్యక్తిని బలవంతంగా డోర్ వద్దకు తీసుకువెళ్లారు. అయితే అతను దిగనంటూ మొండికేసినా.. చివరకు ఆ ఇద్దరు మహిళలు అతడిని బలవంతంగా ట్రైన్ డోర్ నుంచి ఫ్లాట్‌ఫారం మీదకు నెట్టేశారు. ఈ వ్యవహారమంతా స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఆ వ్యక్తికి తగినపని జరిగిందంటూ కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుున్నారు.. ఇప్పుడు దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి : శృంగారం కట్టడికి ఒలింపిక్స్ నిర్వాహకుల వింత ఆలోచన