పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని… ఎక్కడైనా పిల్లలకు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. కొన్ని యూనివర్శిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని… కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని ఆయన వెల్లడించారు. పాఠశాలలకు సెలవులు ఇస్తారని ఎవరూ అనుకోవద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..