బ్యాంక్‌ల నుంచి నగ దు విత్‌డ్రాపై ఎలాంటి జీఎస్టీ లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారా మన్ స్పష్టం చేశారు. ప్రింటర్ నుంచి బ్యాంక్‌లు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపై జీఎస్టీ ఉంటుందని చెప్పారు. వినియో గదారులు ఉపయోగించే చెక్‌బుక్‌లపై జీఎస్టీ ఉండదన్నారు. రాజ్యసభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు.
ముందుగా ప్యాక్ చేసి లేబుల్ వేసిన ఆహార పదార్ధాలపై 5 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని ఆమె చెప్పారు. పేదలు వినియోగిం చే ఏ వస్తువుపై పన్ను విధించలేదని నిర్మలా సీతారమన్ చెప్పారు. విడిగా విక్రయించే వాటిపై ఎలాంటి జీఎస్టీ లేదన్నారు. పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి కొన్ని ఆహార పదార్ధాలపై పన్ను విధించడాన్ని ఆమె సమర్ధించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.