సరుకు లేదు.. సంగతి లేదు.. అంతా డబ్బా.. సుష్కప్రియాలు శునకానదం.. తెలంగాణకు వాళ్లు ఇచ్చిందేమీ లేదు, చేసిందేమీ లేదు. రాజకీయాలకు సంబంధించి స్పందించాల్సిన సమయం కూడా కాదు. కానీ చెప్పాల్సి వచ్చింది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవ్వాల సాయంత్రం ప్రగతి భవన్లో మీడియాతో సీఎం మాట్లాడుతూ.. ‘‘అంతా ఒకరమైన బీటింగ్ అరౌండ్ అన్నట్టు సాగింది. దేశ ప్రజల పక్షాన మేము లేవనెత్తిన సమస్యలమీద కానీ, అడిగిన ప్రశ్నలకు కానీ, సమాధానం చెప్పలేము. మేము అశక్తులను అని వాళ్ల డొల్లతనాన్ని రుజువు చేసుకుని పోయారు.
దేశ సమస్యకు సంబంధించిన గంభీరమైన దృక్పథం వంటివేవీ బీజేపీ దగ్గర లేదని వాళ్లకు వాళ్లే రుజువు చేసుకున్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ రూపాయి విలువ పథనం కావడంపై ప్రశ్నించారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. మరి ఇప్పుడు దేశంలో రూపాయి విలువ సంగతి ఏమైంది. డాలర్‌తో కంపేర్ చేస్తే 80 రూపాయలకు ఎప్పుడైనా పడిపోయిందా? దీనికి ఏమంటారు. ప్రధానిగా మీరే ఉన్నరు కాదా?”అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు చేసిన ప్రసంగాన్ని వీడియో ద్వారా వినిపించారు.