ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి దేశాలు మన దేశంపై బ్యాన్ విధించాయి. ఎవరినీ ఆ దేశాలకు రానివ్వట్లేదు. ఇప్పుడు భారతీయులు పనికోసం అధికంగా వెళ్తున్న గల్ఫ్ దేశాలు కూడా మన దేశంపై ఆంక్షలు విధించేందుకు రెడీ అవుతున్నాయి.
ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ వ్యాక్సిన్లు తీసుకున్న వారు మాత్రమే ఆ సర్టిఫికెట్లను ఎయిర్‌లైన్స్‌కు సమర్పించిన తర్వాతే తమ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. దీంతో గల్ఫ్‌లోని దుబాయ్, ఖతార్ లాంటి దేశాలు కూడా ఇవే ఆదేశాలను అమలు చేయాలని చూస్తున్నాయి. మన దేశంలో తయారైన కొవాగ్జిన్‌ను ఏ దేశం కూడా టీకా కింద గుర్తించలేదు. డబ్ల్యూహెచ్‌వో కూడా తన జాబితాలో పేర్కొనలేదు. దీంతో కొవాగ్జిన్ తీసుకున్నా దానిని ఇతర దేశాలు పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ మన దేశ ప్రజలు ఎక్కువగా కొవాగ్జిన్ తీసుకుంటున్నారు. మరి వీరి ప్రయాణాలకు అవాంతరాలు కలగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.