Friday, November 22, 2024

Elections | ఈవీఎంలపై అనుమానాలు వద్దు.. ఓటర్లకు సీఈసీ భరోసా

దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) వినియోగంపై ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో పోలింగ్‌ ఏజెంట్ల వద్ద ఉంటుందని, లెక్కింపు మొదలయ్యే ముందు వారు వాటిని సరిచూసుకోవచ్చని చెప్పారు.

ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలను తరలించేందుకు అధికారిక వాహనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement