Saturday, November 23, 2024

తెలంగాణలో డెల్టా వేరియంట్ టెన్షన్ లేదు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గముఖం పడుతుంటే.. డెల్టా ప్లస్ వేరియంట్ భయ పడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గింది. ప్రతిరోజు వెయ్యి లోపే కేసులు నమోదు అవుతున్నా.. డెల్టా వేరియంట్ పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. డెల్టా వేరియంట్‌ కన్నా డెల్టా ప్లస్‌ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవలేదని వెల్లడించారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నివేదికలో పేర్కొంది. నెల రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.14 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో 16.39 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామని, 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని వివరించారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. సరాసరి రోజుకు 1.12 లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గింది వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేటు వైద్య కేంద్రాలపై చర్యలు తీసుకుంటాని చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఇవాళ రేపు భారీ వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement