న్యూఢిల్లి: ప్రభుత్వం తరఫున క్రిఎ్టో కరెన్సీని ప్రవేశపెట్టే యోచనలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీలపై ఎటువంటి నియంత్రణ లేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ ఎలాంటి క్రిఎ్టోకరెన్సీలను జారీ చేయడంలేదని తెలిపారు. కేంద్రం ఆర్బీఐ చట్టం 1994 ప్రకారం సంప్రదాయ కాగితపు కరెన్సీని మాత్రమే జారీ చేస్తోందని స్పష్టం చేశారు. కాగితపు కరెన్సీకే త్వరలో డిజిటల్ రూపం ఇవ్వబోతున్నామని దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా పేర్కొంటామన్నారు.
సీబీడీసీని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ ప్రణాళికలు సిద్ధంచేస్తోందని పంకజ్‌చౌదరి రాజ్యసభ వేదికగా తెలిపారు. సీబీడీసీ వల్ల నగదుపై ఆధారపడటం, లావాదేవీ ఖర్చు తగ్గటం, నోట్ల ముద్రణ ఖర్చు తగ్గడం తదితర ప్రయోజనాలు సీబీడీసీ వల్ల ఉన్నాయని వివరించారు. గత కొంతకాలంగా నోట్ల ముద్రణ తగ్గిందని తెలిపారు. 2020-21లో రూ.4,738 కోట్ల విలువ చేసే నోట్లను ముద్రించామని ప్రస్తుతం రూ.4,012కోట్లకు తగ్గిందని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..