హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: అధికారమే లక్ష్యంగా ఇటు- రాష్ట్రంలో, అటు- దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, అన్ని పార్టీలకూ పట్టు-కొమ్మల్లాంటి గ్రామాల్లో కుట్రలు, కుతంత్రాలు జోరందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సి పాలిటీ-లు, నగర పంచాయ తీలు, మేజర్ గ్రామ పంచా యతీల్లో నాయకులు పదవీ వ్యామోహంతో కొట్టు-కు చస్తు న్నారు. అవకాశమే అదు నుగా పదవులను చేజిక్కించు కునేందుకు తహతహ లాడుతున్నారు. గత నెల రోజులుగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల అలజడి కొనసాగుతోంది. ఆర్థిక, భౌగోళిక వనరులు పుష్కలంగా ఉన్న చోట్ల ఈ వ్యవహారం మరింత కుట్రపూరితంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నవారు అక్రమాలకు పాల్ప డిన సందర్భాలు బహిర్గతం కావడంతో అవిశ్వా సాలకు బీజం పడింది. మరికొన్ని చోట్ల పదవులపై ఆశలు పెంచుకున్న నాయకులు తమ పైస్థానంలో ఉన్నవారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత ఒప్పందాలతో అవిశ్వాస తీర్మా నాలు ప్రవేశపెట్టి పదవుల్లో పాగా వేసేందుకు ఎంతటి-కై-నా తెగ బడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఆర్థిక లావాదేవీలు కూ డా భారీగానే జరుగుతున్నాయి. పదవుల కోసం స్థాయిని బట్టి లక్షలు, కోట్లు- చేతులుమారుతున్నాయి.
కొన్నిచోట్ల ‘పదవీకాలం చెరో సగం’ అన్న ఒప్పందాలు ఉల్లంఘనకు గురికావడంతో లొల్లి మొదలైంది. మరికొన్ని స్థానిక సంస్థల్లో కేవలం డబ్బుల కోసమే అవిశ్వాసాలకు సిద్ధ పడుతున్నారు. ఇదే అదునుగా విపక్షాల కుతంత్రాలు కూడా గ్రామీణ ప్రాంతాల రాజకీయ విచ్చిన్నానికి ఊతమందిసు ్తన్నా యి. ఈ క్రమంలో మూడేళ్ల పదవీకాలం పూర్తయిన స్థానిక సంస్థల్లో ముసలం రాజుకుంది. ఈ వ్యవహారం ప్రధాన పార్టీలకు సంకట స్థితిగా మారుతున్నది. ఆయా నియోజకవర్గా లకు బాధ్యతల్లో ఉన్న రాష్ట్రస్థాయి కీలక నేతలకు ఇది గడ్డు కాలంగా కనిపిస్తోంది. పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల పక్రియ పూర్తి అయిన మూడేళ్ళ వరకు ఎలాంటి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం లె దు. అయితే మూడేళ్ళ క్రితం అంటే 2020 జనవరి 27న సర్ప ంచ్, ఉపసర్పంచ్‌లు పదవులు చేపట్టి 2023 జనవరి 27కు మూడేళ్ళు పూర్తి అయింది. ఈ మూడేళ్ళ కాలంగా అంతర్గత విభేదాలున్నా ఓపిక పట్టిన అవిశ్వాసులకు ఒక్కసారే రెక్కలు వచ్చినట్లు- అయింది. విచిత్రమేమంటే ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్న భేదం లేకుండా అందరిపైన అవిశ్వాసాలు మొదలైనాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘా లు, పలు కార్పొరేషన్లు, మేజర్ గ్రామ పంచా యితీల్లో తీవ్ర అసంతృప్తి చోటు-చేసుకుంది.
అనేక చోట్ల ఒప్పందాల ఉల్లంఘన
సర్పంచ్ పద వుల విషయంలో తీ వ్ర పోటీ- ఎదురైన దగ్గ ర సంబంధిత మం త్రులు, ఎమ్మెల్యేలు సర్పంచ్ పదవి కాలాన్ని ఒకరి తర్వాత ఒకరు అను భవించేలా వారిమధ్య ఒప్ప ందాన్ని కుదిర్చి ఆనాటికి సమ స్య అయిందనిపించు కున్నా రు. రెండు న్నరేళ్ళ చొప్పున ఇద్దరు పదవిని చేపట్టాల్సి ఉండగా మూడేళ్ళు అయినా కొందరు పదవిని వీడకపోవడంతో ఆ పదవి కోసం ఆశిస్తున్న వారిలో తీవ్ర ఆసంతృప్తి చోటు-చేసుకుంది. దీంతో అవిశ్వాస తీర్మానంతోనైనా వారి ఆశయాన్ని నెరవేర్చుకొ వచ్చన్న ఉద్దేశ్యంగా చట్ట ప్రకారం మూడేళ్ళవరకు ఆగారు.
గడువు దాటడమే తీర్మానాలకు ఆయుధం
ఈ ఏడాది జనవరి 27తో మూడేళ్ళు ముగియటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాల్టిdల్లో అవిశ్వాస తీర్మానాలు ఒ కదాని వెనుక ఒకటిగా మొ దలైనాయి. తాజాగా జగిత్యాల విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. చైర్‌పర్సన్ బోగ శ్రావణి బల వం తంగా రాజీనామా చే యాల్సిన పరి స్థితి, అందు కు స్థానిక ఎమ్మెల్యే ప్రో త్సా హంపై ఆమె మీడి యా ముం దు ఎలా కన్నీ రు మున్నీరైన సంఘ టన దేశవ్యాప్తమైంది. ప్రస్తుతం చైర్మన్ లుగా కొనసాగుతున్న వారిపై అవిశ్వాసానికి స్థా నిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా మంత్రుల పరోక్ష ప్రమే యా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేటీ-ఆర్ చెప్పినా డోంట్ కేర్
మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పె-్టటొ-ద్దని మంత్రి కేటీ-ఆర్ ఆదేశించినప్పటికీ.. సొంత పార్టీ కార్పొ రేటర్లు, కౌన్సిలర్లు పట్టిం చుకుంటలేరు. జవహర్‌నగర్ మేయర్‌తో పాటు- వికారా బాద్, తాండూరు, పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్ పర్సన్లపై అవిశ్వాసం ప్రకటించారు. పెద్ద అంబర్‌పేటలో వైస్ చైర్ పర్సన్‌పైనా అవిశ్వాస నోటీ-స్ ఇచ్చారు. అవిశ్వాసాలు వద్దన్న కేటీ-ఆర్ ఆదేశాలను జవహర్‌నగర్ కార్పొరేటర్లకు మంత్రి మల్లారెడ్డి చేరవేసినా కార్పొరేటర్లు పట్టించు కోలేదు. మేయర్ మేకల కావ్యపై తమకు విశ్వాసం లేదని 20 మంది కార్పొ రేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్‌ను శని వారం కలి శారు. ఈ కార్పొ రేష న్‌లో 28 డివిజ న్‌లు ఉం డగా మెజార్టీ స్థానా లను బీ ఆర్ ఎస్ గెలు చు కుంది. జవ హర్‌నగర్‌లో మేయర్ కావ్య తండ్రి అ య్య ప్ప, అన్న భార్గవ్ రామ్ ఆధి పత్యాన్ని వ్యతి రేకిస్తూ డిప్యూటీ- మేయర్ శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో కలెక్టర్‌ను కార్పొ రేటర్లు కలిశారు. మేయర్ తమకు వద్దం టూ అడ్వొ కేట్ ద్వారా అవిశ్వాస తీర్మానం అంద జేశారు.
పెద్ద అంబర్‌పేట్‌లో..
పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న, వైస్ చైర్ పర్సన్ చామ సంపూర్ణపై బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్లు మూకుమ్మడిగా అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌లో నోటీ-సు అంద జేశారు. ఈ మున్సిపాలిటీ-లో 24 వార్డు లుండగా 15 మంది అవి శ్వాసం నోటీ-సులపై సం తకాలు చేశారు. మున్సిపల్ ఎన్ని కల్లో మెజార్టీ సీట్లు- కాంగ్రెస్ గెలుచుకు న్నా పార్టీలో వర్గ విభేదా లతో బీఆర్‌ఎస్ అభ్యర్థి చైర్‌పర్సన్, కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్ పర్సన్ పోస్టులు దక్కిం చుకు న్నారు. వారిద్దరి వ్యవహారశైలిపై కోపంతో ఉన్న మెజార్టీ కౌన్సిలర్లు వారిని పదవి నుంచి దిం చేం దుకు సిద్ధమయ్యారు. వైస్ చైర్‌పర్సన్ కాంగ్రెస్ నుంచే ఉండగా ఆమె పై సొంత పార్టీ కౌన్సిలర్లే అవి శ్వాస నోటీ-సులు ఇచ్చారు.
వికారా బాద్‌లో..
వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ చిగుళ్లపల్లి మంజు లను పదవి నుంచి దించాలని కోరుతూ 20 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు శనివారం వికారాబాద్ కలెక్టర్‌కు అవిశ్వాస నోటీ-సులు ఇచ్చారు. వికారాబాద్‌లో 33 వార్డులుండగా బీఆర్‌ఎస్ నుంచి 24 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ఒకరు కౌన్సిలర్‌గా గెలిచారు. చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో మొదటి రెండున్నరేళ్లు మంజుల, తర్వాతి రెండున్నరేళ్లు లంక పుష్పలత రెడ్డి పదవి పంచుకోవాలని ఒప్పందం చేసుకు న్నారు. కాల పరిమితి ముగిసినా పదవి నుంచి దిగేందుకు మంజుల ససేమిరా అనడంతో అవిశ్వాసం పెట్టారు.
తాండూర్‌లో..
తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్నపై వైస్ చైర్ పర్సన్ పటోళ్ల దీప, మరో 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నోటీ-సు అందజేశారు. తాండూరులో 36 వార్డులుండగా బీఆర్ ఎస్ నుంచి 26, ఎంఐఎం నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ, టీ-జేఎస్ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. చైర్ పర్స న్‌పై పది మంది సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు- ఇతర పార్టీల నుంచి గెలిచిన ఇంకో ఆరుగురు అవిశ్వాసం ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత స్వప్న, దీప ఇద్దరు చైర్‌పర్సన్ పదవికి పోటీ- పడ్డారు. పదవిని ఇద్దరు చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసేందుకు స్వప్న ససేమిరా అనడంతో దీపతో పాటు- మరికొందరు కలిసి అవిశ్వాస నోటీ-సులు ఇచ్చా రు. అవిశ్వాసం పెట్టేందుకు తమకు 24 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందని వైస్ చైర్‌పర్సన్ దీప తెలిపారు.
ఎన్నికల ఏడాది కావడంలో నో యాక్షన్
ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అవిశ్వాసం ప్రక టిస్తున్న వారు కూడా పట్టు-దలగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు అధికార పార్టీకి అవసరం కనుక, తమ డిమాండ్‌ను తప్పక అంగీకరిస్తుందన్న నమ్మ కంతో వారున్నారు. ఈ వివాదం మరింత ముదరకుండా వెం టనే పరిష్కరించాల్సిందిగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మె ల్యేలపై ఒత్తిడి తెస్తుండగా, ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు దూ కుడు పెంచుతున్నాయి. కానీ, ప్రధాన రాజకీయ పార్టీల్లో రాష్ట్ర స్థాయి పదవుల గోల, సఖ్యతలేని నిర్ణయాలు, నేతల మధ్య అంతర్గత కలహాలు తదితర పరిణామాలతో సమస్యలు మరిం తగా జటిలమవుతున్నాయి.
పదవి ఊడితే బిల్లులెలా?
పంచాయితీ నిధులు లేమిపై పెద్ద ఎత్తున రచ్చ జరు గుతుంది. పంచాయితీలకు అందాల్సిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందన్న వివాదం ఇంకా కొనసాగు తూనే ఉంది. పంచాయితీ స్థాయిలో పలు నిర్మాణ కార్యక్రమా లకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండిం గ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతు న్నారు. అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో స్వయంగా సర్పంచ్‌లే కాంట్రాక్టర్‌ల అవ తారం ఎత్తి, ఒళ్ళు, ఇల్లు గుల్ల చేసుకుంటు-న్నారు. బిల్లులు అందక అర్థిక భారం మోయలేక నానా అవస్థలు పడు తున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభు త్వం నుంచి నిధులు తేలేని సర్పంచ్‌లు మాకొద్దన్న నినాదంతో కొన్ని గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. తాజాగా అది కాస్త వక్రరూపం దాల్చి పదవుల వ్యామోహం, ఆర్థికపరమైన లావాదేవీలు, ఒప్పందాలకు దారితీసింది.