Monday, November 25, 2024

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ పై అవిశ్వాస తీర్మానం.. ఇవాళే ఓటింగ్..

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే కోవిడ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించి ఆ పార్టీల‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ హాజ‌రైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించాయి. బోరిస్ త‌న ప‌ద‌విలో ఉంటారో లేదా ఇవాళ తేల‌నుంది. నిజానికి లాక్‌డౌన్ పార్టీల విష‌యంలో ప్ర‌ధాని బోరిస్ ఏప్రిల్‌లో 50 పౌండ్ల జ‌రిమానా క‌ట్టారు. కానీ టోరీ పార్టీకి చెందిన కొంద‌రు ఎంపీలు బోరిస్‌పై ఓటింగ్ నిర్వ‌హించాల‌ని కోరాయి. క‌న్జ‌ర్వేటివ్ పార్టీ స‌భ్యులు కూడా అవిశ్వాస ఓటింగ్ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ దీనిపై ఓటింగ్ జ‌ర‌గ‌నున్న‌ది. బ్రిటీష్ కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. క‌నీసం 180 మంది క‌న్జ‌ర్వేటివ్ ఎంపీలు బోరిస్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తేనే కొత్త నాయ‌కుడిని ఎన్నుకునే అవ‌కాశం ఉంది. 54 మంది క‌న్జ‌ర్వేటివ్ ఎంపీలు ఓటింగ్ కోర‌డం వ‌ల్లే బోరిస్ ఇర‌కాటంలో ప‌డ్డట్లు తెలుస్తోంది. అయితే బోరిస్‌కు కొంద‌రు మంత్రులు అనుకూలంగా, కొంద‌రు వ్య‌తిరేకంగా అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement