Friday, November 22, 2024

No change – డొమెస్టిక్‌ గ్యాస్‌ ధర యధాతధం…

న్యూ ఢిల్లీ – ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లను విక్రయించే కంపెనీలు ధరను మరింత తగ్గించాయి. తాజాగా జూన్‌ 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గత నెలలో అంటే మే 1న ఇదే సిలిండర్‌ ధరపై రూ.172 తగ్గింది.

ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. కేవలం కమర్షియం సిలిండర్‌ ధరల్లో మార్పు ఉంది. న్యూ ఢిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గి ప్రస్తుతం రూ.1773కు చేరుకుంది.గత నెలలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1856.50 ఉండేది. ఈ సమయంలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1103 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 1960.50 ఉండగా, తగ్గింపు తర్వాత రూ.1875.50కి చేరింది. ముంబైలో రూ.1808.5 నుంచి రూ.1725కి తగ్గింది. అలాగే చెన్నైలో 2021.50 నుంచి రూ.1937కు చేరింది

Advertisement

తాజా వార్తలు

Advertisement