ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ నిరాశే ఎదురైంది.. ఆమె
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నేడు కొట్టివేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు.
ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీనిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. దీనిపై నేడు జస్టిస్ స్వర్ణకాంతశర్మ తీర్పు వెలువరిస్తూ ఆమె బెయిల్ పిటిషన్ తొసిపుచ్చారు. కాగా, ఈ కేసులో కవిత మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారు. ఆమె తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
- Advertisement -