Monday, November 25, 2024

మూడు రోజులు నో మద్యం..! ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దుకాణాలు సీజ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా లిక్కర్‌ కేసులో ఈడీ విచారణ సంచలనంగా మారిన తరుణంలో రాష్ట్రంలో మద్యం ప్రియులకు షాక్‌ తగులుతోంది. ఈనెల 13న హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీఆంతో మద్యానికి తీవ్ర కటకట నెలకొననున్నది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు, పబ్బులు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. శనివారం సాయంత్రం 4గంటలకు సీజ్‌ అవుతున్న దుకాణాలు తిరిగి 13వ తేదీ సాయంత్రం 4 వరకు తెరచుకోవని ఆబ్కారీ శాఖ వెల్లడించింది.

- Advertisement -

ఈ సమయంలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని, నిబంధనలు పాటించాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు చేసింది. కాగా ఏపీలో కూడా ఈనెల 13న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ పాటించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement