Thursday, November 21, 2024

ప్లాస్టిక్​ నిషేధంపై చర్యలేవీ.. పట్టించుకోని జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ (ప్రతినిధి) : 120 మైక్రోన్ల మందం కలిగిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి, అమ్మకాలను జులై1 నుంచి పూర్తిగా నిషేధిస్తున్నట్టు కేంద్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 2021 ఆగస్టు 12న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిషేధం అమలుకు కావాల్సిన కార్యాచరణను ఎనిమిది నెలల్లో రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ వాడకాన్ని పకడ్భందీగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే నిషేధం అమలు పట్ల సర్కార్‌ సానుకూలంగా లేదని తెలుస్తోంది. ప్లాస్టిక్‌ నిషేధం అమలును నెత్తినెత్తుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యచరణను ప్రకటించలేదు. మొదటి రోజు నిషేధిత ప్రభావం నగరంలో ఎక్కడా కనిపించలేదు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించే కూరగాయలు వ్యాపారులు, కిరాణ షాపులు, టిఫిన్‌ సెంటర్లు, చికెన్‌, మటన్‌ షాపులతో పాటు పెద్దపెద్ద వ్యాపార సంస్థలు సైతం తమకేమి పట్టనట్టు ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో సర్కార్‌ ఇదే విధంగా ప్లాస్టిక్‌ నిషేధంపై హడావిడి చేసినప్పటికీ పెద్దగా ఫలితంలేకుండా పోయింది. తాజాగా కేంద్రం మరోసారీ ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని ప్రకటించినప్పటికి అమలుపై పలువురు పర్యావరణ వేత్తలు సందేహం వెలిబుచ్చుతున్నారు.

నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువులు..

బెలూన్లు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్‌, ఇయర్‌ బడ్స్‌, ప్లాస్టిక్‌ జెండాలు, ఐస్‌ క్రీం పుల్లలు, అలంకరణకు వాడే థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, వేడి పదార్థాలు, స్వీట్‌ బాక్స్‌లకు వాడే పలుచటి ప్లాస్టిక్‌ ఆహ్వాన పత్రాలు, సిగరేట్‌ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపుఉండే ప్లాస్టిక్‌ లేదా పీవీసి బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు, క్యాండి స్టిక్స్‌ మొద లగు సింగిల్‌ యూజ్‌ వస్తువులను నిషేధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement