Thursday, November 21, 2024

సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్స్ తో ఎఅండ్‌ఎం భాగస్వామ్యం.. ఎస్‌సీవీ వాహనాల కోసం డీల్‌

భారతీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా మంగళవారం కీలక ప్రకటన చేసింది. సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్స్‌తో తమ చిన్న వాణిజ్య వాహన శ్రేణి (స్మాల్‌ కమర్షియల్‌ వెహికిల్‌) ఉత్పత్తుల కోసం భాగస్వామ్యం చేసుకున్నట్టు వెల్లడించింది. సీఎస్‌ఈ ఈ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్‌. మీటీ ప్రమోట్‌ చేస్తోన్న స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ) ఇది. వినియోగదారులు తమ దగ్గర్లోని సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్‌ను సందర్శించడంతో పాటు ఎంపిక చేసిన మహీంద్రా ఎస్‌సీవీ శ్రేణి అంటే సుప్రో, జీతో లాంటి వాటి గురించి తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ ఎస్‌సీవీ ఆటోమోటివ్‌ డివిజన్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ సాగర్‌ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యంలో భాగంగా సీఎస్‌సీ విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రిన్యూర్స్‌ (వీఎల్‌ఈ) నెట్‌వర్క్‌, భారతదేశ వ్యాప్తంగా దాదాపు 7లక్షల గ్రామాల్లో ఎంఅండ్‌ఎం టచ్‌ పాయింట్ల ద్వారా సేవలందించనుందన్నారు. తద్వారా ఎంక్వైరీ, కొనుగోలు ప్రక్రియను మరింత సులభంగా మార్చగలరని, ఇది డిజిటల్‌గా వీఎల్‌ఈలు ప్రాసెస్‌ చేయడానికి తోడ్పడుతుందని వివరించారు. తద్వారా వారు తగిన సమాచారం అందించడంతో పాటు ఆ టెస్టు డ్రైవ్‌ చేసే అవకాశం కల్పించి అధీకృత మహీంద్రా డీలర్‌ ద్వారా డెలివరీ అందించేందుకు సైతం తోడ్పడుతుందన్నారు. ఈ సేవలు భారతదేశ వ్యాప్తంగా లభ్యం అవుతాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాలకు సేవలు
ఇంటర్నెట్‌ వేగంగా విస్తరిస్తుండటంతో పాటుగా సమాచారాన్ని అత్యుత్తమంగా పొందేందుకు సైతం తోడ్పడుతుందని అమిత్‌ సాగర్‌ తెలిపారు. ఈ భాగస్వామ్యం తమ గ్రామీణ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు తోడ్పతుందని, తమ వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడంలో తోడ్పడే సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్‌ను మించిన భాగస్వామి లేరని తెలిపారు. తాము డిజిటల్‌ పరిష్కారాలపై అధికంగా దృష్టి సారించినట్టు వివరించారు. తమ నైపుణ్యవంతులైన వీఎల్‌ఈలు వినియోగదారులకు అవసరమైన ఆత్మవిశ్వాసం, సౌకర్యాన్ని మహీంద్రాతో ఈ భాగస్వామ్యం ద్వారా అందించగలరని చెప్పుకొచ్చారు. ఇది కొనుగోలును మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు వినియోగదారులతో లోతుగా కనెక్ట్‌ అయ్యేందుకు సైతం సహాయపడుతుందన్నారు. ఈ భాగస్వామ్యంతో సీఎస్‌సీ గ్రామీణ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మహీంద్రా వాహనాల ఎంక్వైరీలకు తగిన సాయం అందించడంతో పాటు రియల్‌ టైమ్‌ ఆన్‌లైన్‌ ఆధారిత బదిలీని ఎంఅండ్‌ఎంకు అందిస్తుందని వివరించారు.

ఎంఅండ్‌ఎంతో డీల్‌ సంతోషకరం
సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్‌ ఆపరేటింగ్‌ ఆఫీస్‌ చీఫ్‌ రాజా కిశోర్‌ మాట్లాడుతూ.. మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ-స్టోర్‌ అనేది విప్లవాత్మక భారత ప్రభుత్వ కార్యక్రమని తెలిపారు. సాంకేతికతను ఓ ఉపకరణంగా వినియోగించడం ద్వారా వినియోగదారుల చెంతకు ఉత్పత్తులు, సేవలను తీసుకొచ్చి వారికి తగిన సౌకర్యం అందించగలమని తెలిపారు. ఈ భాగస్వామ్యం.. మరింతగా వినియోగదారుల అనుభవాలను వృద్ధి చేయడంతో పాటు మారుమూల గ్రామాల్లోని వ్యక్తులు సైతం మహీంద్రా చిన్న వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడంలో తోడ్పడుతుందన్నారు. వినియోగదారుల అనుభవాలను మరింత వృద్ధి చేయగలమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement