Saturday, November 23, 2024

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన నిజాం ముని మనవడు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిజాం ముని మనుమడు హిమాయత్ అలీ మీర్జా శుక్రవారం నాడు లేఖ రాశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ జయంతి లేదా వర్థంతిని అధికారిక కార్యక్రమంగా గుర్తించి.. ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపించి.. ఎయిర్‌పోర్టు, హైకోర్టు, యూనివర్సిటీ, ఆస్పత్రులు, రిజర్వాయర్లు నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మాన్ అలీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. దేశరక్షణ నిమిత్తం 5వేల కేజీల బంగారం దానం చేశారని ఆయన ఉదారతను గుర్తుచేశారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడాన్ని అభినందించిన అలీ మీర్జా.. ఏడో నిజాంను విస్మరించరాదని సూచించారు. నిజాం నిర్మించిన ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక చూసి ఆశ్చర్యపోయిన తీరును లేఖలో ప్రస్తావించారు. ఇక హైదరాబాద్‌ నగరంలో పెరిగిన కాలుష్యం కారణంగా ఏటా 4500 మందికి పైగా మృత్యువాత పడుతున్నారని లేఖలో మీర్జా పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: గద్దర్‌పై కేసును ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం

Advertisement

తాజా వార్తలు

Advertisement