Monday, November 25, 2024

Bihar: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. మద్దతుగా 129 ఓట్లు

బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఇవాళ బలపరీక్షను ఎదుర్కొంది. గవర్నర్ ఇవాళ నిర్వహించిన ఈ బలపరీక్షలో నితీష్ కుమార్ నెగ్గారు. ఆయనకు 129 మంది సభ్యుల మద్దతు లభించింది. అనంతరం సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కాగా, గత నెలలో విపక్షాల ఇండియా కూటమిని వదిలిపెట్టి NDA-BJP కూటమిలో నితీష్ తిరిగి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిహార్‌ రాష్ట్రానికి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

ఇదిలా ఉండగా.. బలపరీక్షకు ముందు రోజు వరకు బిహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులుగా బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఎమ్మెల్యేలు పాట్నా వెళ్లారు. దీంతో నితీశ్ సర్కారు 129తో బలపరీక్షలో గెలుపొందింది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది కావాల్సి ఉంది. నితీష్ కుమార్ కూటమికి 129 మంది సభ్యుల సపోర్ట్ రావడంతో ప్రభుత్వ ఏర్పాటు సులభం అయంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement