ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై మాటల యుద్ధాన్ని కొనసాగించారు.నితీశ్ కుమార్ పై వయసు ప్రభావం పడుతోందని, ఆయన భ్రాంతికి లోనవుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఏకాకిగా మారిన నితీశ్ కుమార్, ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల నితీశ్ ఎంతో అసహనంతో కనిపిస్తున్నారని, బహుశా అది వయసు ప్రభావం అనుకుంటా అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిశోర్ బీహార్ లో పాదయాత్ర చేపడుతుండడం తెలిసిందే. దీనిపై నితీశ్ కుమార్ విమర్శిస్తూ, బీజేపీ కోసమే ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ తాజాగా స్పందించారు. నేను బీజేపీ అజెండాతో పనిచేస్తున్నానని ఆయన (నితీశ్ కుమార్) అంటున్నారు. అదే సమయంలో, ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పానట. ఇది ఎలా సాధ్యమవుతుంది.. నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టయితే, ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయాలని ఎలా చెబుతాను.. ఒకవేళ ఆయన చేసిన రెండో ఆరోపణ కరెక్ట్ అయితే, మొదటి ఆరోపణ తప్పు అవుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement