గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేడు ఆయనరాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఐదింటిని 216 నేషనల్ హైవేపై నిర్మిస్తుండటం విశేషం. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక నుంచి ఆయన ప్రసంగించారు. అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు, బీజేపీ నేతలు కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు.జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.3 వేల కోట్ల నిధులు కేటాయించారు. అలాగే, వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో పర్యటిస్తోన్న నితిన్ గడ్కరీ-ఐదు ప్లై ఓవర్లకు శంకుస్థాపన
Advertisement
తాజా వార్తలు
Advertisement