Tuesday, November 26, 2024

విప‌క్షాల కూట‌మి నాయ‌కుడిగా శ‌ర‌ద్ ప‌వార్ – ఓకే అంటున్న‌ నితీష్‌ కుమార్‌

ముంబాయి: వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీతో పోటీపడే విపక్ష కూటమికి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ నాయకత్వ వహిస్తా నంటే అంతకంటే కావల సింది ఏముందని బీహార్‌ సీఎం, జేడీ(యూ) నేత నితీష్‌ కుమార్‌ అన్నారు. గురువారమిక్కడి దక్షిణ ముంబాయిలో శరద్‌ పవార్‌ నివాసానికి బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ తో పాటు ఆయన చేరుకున్నారు. విపక్షాల ఐక్యతపై పవార్‌తో చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీహార్‌ సీఎం మాట్లాడుతూ పాలక బీజేపీ చేస్తున్న పనులు ప్రజల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపకరించడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా విపక్షాల కూటమికి పవార్‌ నేతృత్వం వహిస్తే ఎలా ఉంటుంది అని విలేకరులు ప్రశ్నించగా ”అంత కంటే ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు మీ పార్టీ కోసమే కాకుండా యావత్‌ దేశం కోసం మరింతగా పనిచేయాలని నేను ఆయనతో అన్నాను’ అని నితీష్‌ కుమార్‌ బదులిచ్చారు. శరద్‌ పవార్‌ మాట్లాడుతూ ‘ప్రజా స్వామ్య పరిరక్షణకు కలసికట్టుగా పనిచేయడం ముఖ్యం. దేశంలో పరిస్థితిని చూసిన తర్వాత మేమంతా(బీజేపీయేతర పార్టీలు) కలసికట్టుగా పనిచేసిన పక్షంలో ప్రత్యామ్నాయానికి(బీజేపీకి) మద్దతు ఉంటుంది” అని అన్నారు. కర్నాటక అసెంబ్లి ఎన్నికలపై మాట్లాడుతూ బీజేపీ సర్కారు దిగిపో తుందని, ఒక లౌకికవాద ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు ఎన్నుకుంటారని ఆయన తెలిపా రు. తన ముంబాయి పర్యటనలో భాగంగా శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్‌ థాక్రే ను ఆయన నివాసంలో నితీష్‌ కుమార్‌ కలుసుకున్నారు. ”ప్రతిఒక్కరూ ఏకమై న పోరాటం చేస్తే పక్కా పోటీ(బీజేపీతో) ఉంటుంది. ఘన విజయం (విపక్షాలకు) లభిస్తుంది. దేశం సరైన దిశలో పురోగమిస్తుంది” అని బీహార్‌ సీఎం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement