Friday, November 22, 2024

త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు: నితిన్‌ గడ్కరీ

త్వరలోనే టోల్‌ప్లాజాలు లేని హైవేలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తీసుకురాబోతుందని ప్రకటించారు. ఇందుకు రాబోయే మూడునెలల్లో కొత్త పాలసీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.వచ్చే ఏడాది జీపీఎస్‌ ఆధారిత టోల్‌ సేకరణ వ్యవస్థ అమలులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు లేదని.. టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రోడ్ల నిర్మాణంలో నిమగ్నమైన అన్ని కంపెనీలు స్టీల్‌, సిమెంట్‌ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. వాటి ధర, పరిణామాన్ని తగ్గించేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై టోల్‌ సేకరణ కోసం ప్లాజాలకు బదులుగా.. కేంద్రం జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను తీసుకురాబోతుందని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement