Friday, November 22, 2024

నిర్మ‌లా సీతారామ‌న్ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి… హ‌రీశ్ రావు

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. మెద‌క్ జిల్లా తూప్రాన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… వాళ్ల‌వి అర్థ స‌త్యాలు.. మావి న‌గ్న స‌త్యాల‌ని అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం రూ.2.78ల‌క్ష‌లు అన్నారు. దేశంలో ప్ర‌జ‌ల త‌ల‌స‌రి ఆదాయం రూ.1.49ల‌క్ష‌లు అన్నారు. ఆయుష్మాన్ భార‌త్ లో తెలంగాణ చేర‌లేద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ అంటున్నార‌ని, తెలంగాణ ఆయుష్మాన్ భార‌త్ లో చేర‌లేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తాన‌న్నారు. మేం ఇప్ప‌టికే చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తారా అని నిర్మ‌లా సీతారామ‌న్ ను ప్ర‌శ్నించారు.

పార్ల‌మెంట్ సాక్షిగా మీరు చెప్పింది గుర్తు లేదా అని ప్ర‌శ్నించారు. బీజేపీ వాళ్లు ప‌చ్చి అబ‌ద్దాలు మాట్లాడుతున్నార‌న్నారు. కేంద్రం రైతులు, పేద‌ల న‌డ్డి విరిచింద‌న్నారు. రాష్ట్రాల‌కు మొండిచేయి చూపించార‌న్నారు. రూపాయి విలువ రోజురోజుకు ప‌డిపోతోంద‌న్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో భార‌త్ ది 144వ స్థాన‌మ‌న్నారు. ప్ర‌పంచ కుబేరుల్లో ఆదానీ మూడో స్థానానికి ఎగ‌బాకారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement