Tuesday, November 19, 2024

క‌రోనా, ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధ‌ర‌ల‌తో ఆర్ధిక‌రంగంలో త‌డ‌బాటు – నిర్మలా సీతారామ‌న్

న్యూ ఢిల్లీ – క‌రోనా, ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధ‌ర‌ల‌తో మ‌న‌ ఆర్ధిక‌రంగంలో ఒడిదుడుకులు ఏర్ప‌డ్డాయ‌ని,అయిన‌ప్ప‌టికీ
ప్రపంచదేశాలతో పోలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ చెప్పారు.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో నేటి ఉద‌యం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు.


2023-24లో ఆర్ధిక వృద్దిరేటు 6-6.8శాతం ఉండే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.. రానున్న ఆర్ధిక సంవత్సరంలో 7 శాతం వృద్దిరేటు అంచనా వేశామని, కాని అతి కాస్త తగ్గే అవకాశం ఉందని వివ‌రించారు. అధికధరలు,ఉక్రెయిన్‌ యుద్దం భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు నిర్మలా సీతారామన్‌. రూపాయి విలువ పతనం కావడం ఆందోళనగా ఉందన్నారు. అయినప్పటికి భారత్‌ దగ్గర విదేశీ మారకద్రవ్యం తగినంత ఉందన్నారు. కరోనా సంక్షోభం నుంచి భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా కోలుకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement