Sunday, November 17, 2024

NIRF Rankings | ఉన్నత విద్యా సంస్థల జాబితా విడుద‌ల..

దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల పనితీరు ఆధారంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంక్‌లను కేటాయిస్తుంది. ఈ క్రమంలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ సోమవారం ఉత్తమ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉత్తమ విద్యాసంస్థల తొమ్మిదో ఎడిషన్ జాబితాను విడుదల చేసింది.

ఎన్ఐఆర్ఎఫ్ 2024 ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ వరుసగా ఆరోసారి తన ర్యాంక్‌ను నిలుపుకుంది. ఇక‌ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు (ఐఐటీ-బెంగళూరు) 2వ ర్యాంక్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (ఐఐటీ-బాంబే) 3వ ర్యాంక్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ-ఢిల్లీ) 4వ ర్యాంక్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (ఐఐటీ-కాన్పూర్) ) 5వ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement