Friday, November 22, 2024

రైతుల,పేద‌ మ‌ధ్య త‌ర‌గ‌తి బ‌డ్జెట్ ఇది..నిర్మలా సీతారామ‌న్..

న్యూఢిల్లీ – అమృత్ కాల్ లో ఇది తొలి బ‌డ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు..లోక్ స‌భ‌లో కేంద్ర బ‌డ్జెట్ ను నేడు ఆమె ప్ర‌వేశ‌పెట్టారు.. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ,
రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. తొమ్మిదేండ్లలో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ఎదిగామన్నారు. తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామన్నారు. 7శాతం వృద్ధి రేటును ఆర్థిక సర్వే అంచనా వేసిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగామన్నారు. కోవిడ్ టైమ్ లో ఎవరూ ఆకలితో బాధపడలేదన్న సీతారామన్ ఉచిత ఆహారధాన్యాల పంపిణీ కొనసాగుతోందని చెప్పారు. 2047 లక్ష్యంగా పథకాలను రూపొందిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి సాధించామని చెప్పారు,
2014 నుంచి దేశవ్యాప్తంగా 150కు పైగా వైద్యకళాశాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. త్వరలోనే ఐసీఎంఆర్‌ ప్రయోగశాలల విస్తృతిని మరింత పెంచుతామన్నారు. ఫార్మారంగంలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. వైద్య కళాశాలల్లో మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

సప్త రుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్‌ ప్రాధాన్యం : సీతారామన్

వ్యవసాయం కోసం డిజిటల్‌ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు.
వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం.
వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు.
పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ క్లీన్‌ పథకం ఉద్యానవన పంటకు చేయూత
చిరుధాన్యాల పంటలకు సహకారం. ఇందుకోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రోత్సాహం
స్వచ్ఛ భారత్‌లో భాగంగా 11.7కోట్లతో టాయ్‌లెట్స్‌ నిర్మాణం చేపట్టామని నిర్మలా సీతారామన్ తెలిపారు.44కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకం అందుతోందన్నారు. ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని తెలపారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement