నటి పూర్ణకి ఇప్పుడు తొమ్మిదో నెల. దాంతో ఆమెకి కుటుంబసభ్యులు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. పూర్ణకు ఇష్టమైన తొమ్మిది రకాల వంటకాలు చేసి తినిపించారు. ఆమె కోసం తల్లి, సిస్టర్ చేసిన వంటకాలు చూపిస్తూ వీడియో చేశారు. ఆ వంటకాలను పూర్ణకు భర్త అసిఫ్ అలీ ప్రేమగా తినిపించారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో చెప్పుకుని పూర్ణ గొప్పగా ఫీలైంది. దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ రహస్య వివాహం చేసుకుంది. నిశ్చితార్థం గురించి చెప్పిన పూర్ణ పెళ్లి మేటర్ ఎవరికీ చెప్పలేదు. అందరూ పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే… ఆల్రెడీ జరిగిపోయిందని సడన్ షాక్ ఇచ్చింది. ఓ సందర్భంలో మాట్లాడుతూ… 2022 మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement