లడఖ్ లేహ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందారని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని ఖేరి వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఘటనలో మరికొంత మంది సైనికులు గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది సైనికులతో పాటు ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నారు. ట్రక్కు కరూ నుంచి గ్యారీసన్ నుంచి లేహ్ సమీపంలోకి క్యారీకి వెళ్తున్న సమయంలో లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 34 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తున్నది. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి