మంత్రి హరీష్ రావు నీలోఫర్ ఆసుపత్రిలో ఐసీయూవార్డుని ప్రారంభించారు. ఆరోగ్యశాఖ మంత్రిగా మొదటి కార్యక్రమం నీలోఫర్ ఆసుప్రతిలో చేయడం సంతోషంగా ఉందని హరీష్ రావు తెలిపారు. కార్పొరేట్ హాస్పటల్ కి ధీటుగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. ఇక కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 133కోట్ల నిధిని కేటాయించామని చెప్పారు. మెడికల్ సిబ్బందికి అండగా ఉంటామని హరీష్ రావు తెలిపారు.
Breaking : నీలోఫర్ ఐసీయూ వార్డ్ ని ప్రారంభించిన హరీష్ రావు..థర్డ్ వేవ్ ని ఎదుర్కొంటాం..
Advertisement
తాజా వార్తలు
Advertisement