Sunday, September 22, 2024

నిఖిలేశ్వ‌ర్ ‘అగ్నిశ్వాస‌’కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారం..

న్యూఢిల్లీ/అమ‌రావ‌తి : గతేడాది 2020 సంవత్స రానికిగానూ కేంద్ర సాహిత్య‌ అకాడమీ అవార్డులను ప్రకటించింది. 20 భాషల్లో సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించారు. పద్య కవిత్వంలో 7 , 4 నవలలకు, 5 చిన్న కథలకు, 2 నాటకాలకు ఈ జాతీయ పురస్కారాలను అందజే యనున్నారు. తెలుగులో నిఖిలేశ్వర్‌ రచించిన అగ్ని శ్వాస కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. దిగంబర కవుల్లో ఒకరిగా పేరొందిన కుంభం యాదవరెడ్డి కలం పేరు నిఖిలేశ్వర్‌. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న యాదవరెడ్డి కథ, కథకుడు, అనువాదకుడు, విమర్శకుడిగా పేరొందారు. విజేతలకు లక్ష రూపాయల నగదు, తామ్ర పత్రాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అందజే యనుంది. దీంతో పాటు 2020కి గానూ 18 భాషల్లో సాహిత్య అకాడమీ యువ పురస్కారాలనూ ప్రక టించింది. ఇక తెలుగు భాష నుంచి మానస ఎండ్లూరి రచించిన మిళింద షార్ట్‌ స్టోరీ అవార్డుకు ఎంపికైంది. యువ పురస్కార గ్రహీతలకు 50 వేల నగదు బహు మానం, తామ్ర పత్రం అందజేయనున్న అకాడమీ వెల్లడించింది. ‘స్నేహ‌వితులు’ అనే లఘు కథా సంపుటికి రచయిత్రి కన్నెగంటి అనసూయను కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రచయిత వీరప్ప మెయిలీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఆయన కన్నడంలో రచించిన శ్రీ బా హుబలి అ హంసాదిగ్విజయం అనే ఇతిహాస కవిత్వ సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు లభించింది. అరుంధతి సుబ్ర హమణ్యం ఆంగ్లంలో రచించిన ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఏ ట్రావెలర్‌’ అనే కవితా సంపుటికీ అవార్డు దక్కింది. సాహిత్య రంగంలో విశేష రచనలకు ప్రతియేటా కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. నవల, కథ, విమర్శ వంటి విభాగాల్లో ఈ పురస్కారాలను ఇస్తారు.
నిఖిలేశ్వర్‌ ప్రస్థానం
నిఖిలేశ్వర్‌ అసలు పేరు కుంభం యాదవ రెడ్డి. కవిగానే కాకుండా అనువాదకుడి గా, కథకునిగా, విమర్శకునిగా ఆయన పేరు గడించారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరు మీదే రచనలు చేశారు. 1965 నుంచి తన పేరును నిఖిలేశ్వర్‌గా మార్చుకున్నారు. దిగంబర్‌ విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో విరాజిల్లారు.
విప్లవ రచయిత సంఘం (విరసం)కి వ్యవస్థాపక కార్యదర్శిగా(1973) వ్యవహ రించారు. పౌరహక్కుల ఉద్యమంలో కూడా పాల్గొ న్నారు. 1969లో ‘పోయెట్‌’ (ఇంగ్లిష్‌ పోయెట్రీ మంత్లిd – మద్రాస్‌) అనేక ప్రత్యేక సంచికకు గెస్ట్‌ ఎడిటర్‌గా వ్యవహరించి దిగంబర కవిత్వాన్ని ఆం గ్లంలోకి అనువదించారు. 1980 -82 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక ‘ప్రజా సాహితి’కి సంపాదకు లుగా వ్యవహరించారు. 1992-97 వరకు కేంద్ర సాహిత్య అకాడమీలో తెలుగు అడ్వైజరీ బోర్డ్‌ మెంబర్‌గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా వివిధ సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు.
మానస ఎండ్లూరి ప్రస్థానం
మానస ఎండ్లూరి తల్లిదండ్రులు ఎండ్లూరి సుధాకర్‌, పుట్ట హేమలతలు తెలుగు రచయితలు. మానస రాజమండ్రిలో పెరిగారు. ఏలూరు సెయింట్‌ థెరిస్సాలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌, సైకాల జీలో డిగ్రీ చేశారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో భాషాశాస్త్రంలో పీజీ చేశారు. నెల్లూరు, హైదరాబాద్‌ ప్రాంతాల మాండలికా లతో అనుబంధం ఎక్కువ. తాను చేసే రచనల్లో వివిధ సామాజిక అంశాలను స్పృశించడం ఈ యువ రచయిత్రి ప్రత్యేకత. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు, స్వలింగ ప్రేమలు- సమస్యలు, దళిత క్రైస్తవ జీవన నేపథ్యంలో రాస్తారు. ఆమె నా మొదటి కథ ‘గౌతమి’ విహంగ (మహిళా సాహిత్య పత్రిక)లో ప్రచురితమైంది.
రచనలు(కవితలు): దిగంబర కవులు, మండు తున్న తరం, ఈనాటికీ, నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహా నగరం, ఎవరీ ప్రజా శతృవులు?, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగ, యుగస్వరం, కాలాన్ని అధిగమించి, నిఖిలేవ్వర్‌ కవిత్వతోపాటు పలు రచనలు ఉన్నాయి.
ఇక గద్య రచనల విషయానికి వస్తే.. గోడలు వెనుక, పొలిటికల్‌ అండ్‌ లిట్రరీ క్రిటిక్‌ ఓవర్‌ విరసం, ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు, ఎవరిది ప్రజాస్వామ్యం?, నిఖిలేశ్వర్‌ కథలుతోపాటు ఇతర రచనలు ఉన్నాయి. ఆయన ప్రముఖ అనువాద రచనలు కూడా చేశారు.
సీఎం జగన్‌ అభినందనలు
కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డును సొంతం చేసుకున్న ప్రఖ్యాత కవి నిలేఖర్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. నిఖిలేశ్వర్‌ కేవలం రచయితే కాకుండా, మంచి అనువాదకుడిగా గుర్తింపు పొందారని కొనియా డారు. ఆమన రచించిన అగ్ని శ్వాస 2020 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపివడం ముదా వహమన్నారు. విరసం (రివల్యూషనరీ రైటర్స్‌ అసోసియేషన్‌) వ్యవస్థాపక కార్యదర్శి నిఖిలేశ్వర్ కూడా తెలుగు భాషా రచనల్లో కొత్త ధోరణిని సృష్టించిన దిగంబర కవిగా ఆయన అభివర్ణించా రు. అలాగే, స్నేహితులు అనే చిన్న కథల పుస్తకానికి బాలా సాహిత్య పురస్కర్‌ 2020 ను గెలుచుకున్నం దుకు ప్రముఖ రచయిత కన్నెగంటి అనసుసుయను కూడా ముఖ్యమంత్రి జగన్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement