మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్ ప్రి-క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఈవెంట్లో (50కేజీ) అల్జిరియాకు చెందిన బౌలమ్ రౌమైసాను ఓడించి, ప్రి-క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆఫ్రికన్ చాంపియన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. ఈ టోర్నీలో నిఖత్‌కు ఇది రెండవ గెలుపు. మరో మ్యాచ్‌లో గత ఎడిషన్ కాంస్య పతక విజేత మనీషా మౌన్ (57 కేజీలు) కూడా ఆస్ట్రేలియాకు చెందిన రహామి టీనాపై 5-0 తేడాతో విజయం సాధించి 16వ రౌండ్‌కు చేరుకుంది. గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ ఈ గేమ్‌లో రక్తం చిందించింది. ఇరువురు మేటి బాక్సర్లు హోరాహోరీగా తలపడ్డారు. నిఖత్ కొన్ని కాంబినేషన్ పంచ్‌లు వేస్తే, రౌమైసా భారత బాక్సర్ ఓపెన్ స్టాన్స్‌ను ఉపయోగించుకుంది.
అయితే, మొదటి రౌండ్ నిఖత్‌కు అనుకూలంగా సాగింది. ఇద్దరు బాక్సర్లు దూకుడుతో ఆడారు. చాలా బాడీ క్లిన్చింగ్ను ఆశ్రయించారు. కానీ చివరికి ఢిల్లిలోని జాదవ్ స్టేడియంలో భారత అభిమానులను ఆనందపరిచేలా నిఖత్ జరీన్ విజయాన్ని అందుకుంది. మరోవైపు మనీషా కూడా దూకుడుగా ఆడింది. ఆమె బౌట్లో ఆధిపత్యం చెలాయిస్తూ రింగ్ చుట్టూ డ్యాన్స్ చేసింది. ఆమె దూరం నుండి పోరాడుతూ, ఆత్మవిశ్వాసంతో ఆడింది. అభిమానుల మద్దతు మధ్య వారిని ఆనంద డోలికల్లో ముంచింది.