దేశంలో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోంది. రోజు వేలల్లో కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు మహారాష్ట్ర విలవిలాడుతోంది. దీంతో కరోనా కట్టడి నేపథ్యంలో మహారాష్ట్ర నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక వీకెండ్స్ లో లాక్ డౌన్ అమలు చేయనున్నారు. తాజాగా ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు విధించింది. అయితే అత్యావసర సేవలు, ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement