నలుగురు రోగులకు డబుల్ నెగిటివ్ అని పరీక్షల్లో నిర్దారణ కావడంతో కేరళలోని కోజికోడ్‌లో నిఫా వైరస్ పూర్తిగా కట్టడి అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం తెలిపారు. వైరస్ కారణంగా గత నెలలో మరణించిన ఒక వ్యక్తికి చెందిన తొమ్మిదేళ్ళ కుమారుడికి డబులు నెగిటివ్ అని తేలడంతో డిశ్చార్చ్ చేసినట్టు చెప్పారు. కోజికోడ్‌లో ఈ నెల రెండవ వారంలో నిఫా వైరస్ లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మరణించడంతో అధికారులు వైరస్ వ్యాప్తిని గుర్తించారు. వైరస్ కారణంగా రెండు మరణాలను, ఆరు పాజిటివ్ కేసులను కోజికోడ్ నమోదు చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement