ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో నేరం ఎలా చేశాడో తెలుసుకునేందుకు రీకన్ స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అంబానీ నివాసం యాంటీలియా ముందు శుక్రవారం రాత్రి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఫోరెన్సిక్ అధికారులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి సచిన్ వాజేతో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. శుక్రవారం రాత్రి 10.40 నిమిషాలకు చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన వాజేను ఘటనా స్థలానికి తీసుకెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కారులో పీపీఈ కిట్ వేయించి, తలకు హ్యాండ్ కర్చీఫ్ కట్టించిన అధికారులు.. సీసీటీవీ ఫుటేజీల్లో ఎక్కడి నుంచైతే వాజే నడిచినట్టు కనిపించిందో అక్కడి నుంచే మళ్లీ నడిపించారు. మళ్లీ అక్కడి నుంచి వెనక్కు రమ్మన్నారు. ఆ టైంలో వాజే కాస్త కళ్లు తిరిగి పడిపోయినట్టు చేశాడు. వెంటనే అధికారులు ఏమైందని అడగడంతో.. అంతా బాగానే ఉందని చెప్పాడు. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీశారు.
సినిమా షూటింగ్ లెవెల్లో ఈ సీన్ రీ కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ సమయంలో అటువైపు వాహనాలను పోలీసులు అనుమతించలేదు.