Tuesday, November 26, 2024

NIA | మానవ అక్రమరవాణాపై ఎన్‌ఐఎ చార్జిషీట్‌ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మానవ అక్రమ రవాణా కేసుపై ఎన్‌ఐఎ దర్యాప్తు పూర్తి చేసింద. ఈక్రమంలో 2023 నవంబర్‌ 7న నమోదు చేసిన కేసుకు సంబంధించి చార్జిషీట్‌లో కీలక అంశాలను పేర్కొంది. ముఖ్యంగా హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడిన ముగ్గురు మయన్మార్‌ దేశస్థులపై ఎన్‌ఐఏ అధికారులు చార్జీషీట్‌లో వివరించారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లుగా ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారని, నకిలీ ధృవీకరణ పత్రాలతో నకిలీ పత్రాలను ఆధార్‌ తీసుకున్నట్లు చార్జిషీట్‌లో తెలిపారు. దేశంలోని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, జమ్ముకశ్మీర్‌లో నిందితులు పలువురితో పరిచయాలు పెంచుకున్నట్లుగా వెల్లడించారు. అనంతరం యువతులతో మాటలు కలిపి వారిని వివాహం చేసుకుని యువతులను అక్రమంగా దేశం దాటిస్తున్నట్లుగా ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement