Tuesday, November 26, 2024

బెంగళూరు-మైసూరు మార్గంలో మరో హైవే.. పరిశీలించనున్న ఎన్​హెచ్​ఏఐ భద్రతా కమిటీ

కర్నాటక ప్రజలకు మరో హైవే అందుబాటులోకి రానుంది. దీన్ని బెంగళూరు-మైసూరు మధ్యలో ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భద్రతా తనిఖీలు చేపట్టేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI).. రోడ్డు భద్రతా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం సైట్‌ను సందర్శిస్తున్నట్టు సమాచారం. ఇక.. జులై 20వ తేదీ నాటికి తమ అధ్యయనాన్ని ముగించి దీనికి సంబంధించిన రిపోర్టును తయారు చేయనున్నారు. ఆ తర్వాత 10రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ తన నివేదికను అందజేయనున్నది.

కాగా, ఈ హైవే కర్నాటక రాష్ట్రంలోని రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 75 నిమిషాల వరకు తగ్గించనున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలో వేగంగా రూపాంతరం చెందుతున్న రహదారుల వ్యవస్థకు, ప్రపంచ స్థాయి జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను రూపొందించడానికి NHAI నిబద్ధతకు ఈ హైవే నిదర్శనంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement