Monday, November 25, 2024

హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటీ ఆగ్రహం.. నివేదిక ఇవ్వాలని ఆదేశం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌ నగరంలో చెరువుల ఆక్రమణలపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) అచేతన స్థితిలో ఉందంటూ ఎన్జీటీ మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నగరంలో చెరువుల ఆక్రమణలపై మీడియాలో వచ్చిన ఓ వార్తను సుమోటోగా తీసుకుని ఎన్జీటీ ఈ మేరకు విచారణ జరిపింది.

8718 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు నివేదిక ఇచ్చిన జీహెచ్‌ఎంసీ, బఫర్‌జోన్‌లో 5343 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలిపింది. చెరువుల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ వైఖరి పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. చర్యలు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని జీహెచ్‌ఎంసీకి హితవు పలికింది. విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసిన ఎన్జీటీ, అప్పటిలోగా ఆక్రమణలపై తీసుకున్న చర్యలను నివేదించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement