Friday, November 22, 2024

ఎన్‌జీఓలకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. విదేశీ నిధుల లైసెన్స్‌ రగడ

ఎన్‌జీఓలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 6000కు పైగా ప్రభుతేతర సంస్థలు లేదా ఎన్‌జీఓలకు విదేశాల నుంచి నిధులు పొందేందుకు అవసరమైన లైసెన్స్‌లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తరులు జారీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. యూఎస్‌కు చెందిన ఎన్‌జీఓ గ్లోబల్‌ పీస్‌ ఇనిషియేటివ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దేశంలో మూడో వేవ్‌ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతున్నందున లైసెన్స్‌ల రద్దు కరోనా సహాయ చర్యలపై బలహీనపర్చే ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ ఎన్‌జీఓలు ఇప్పటి వరకు మిలియన్‌ల మంది భారతీయులకు సాయం చేశాయని గుర్తు చేసింది. ఇది అవసరమైన పౌరులకు సహాయ నిరాకరణకు దారితీస్తుందని పేర్కొంది.

గడువులోగా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న 11,594 ఎన్‌జీఓలకు ఇప్పటికే గడువు పొడిగించామని జస్టిస్‌ ఏంఎ ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ అభ్యర్థన వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రశ్నించారు. లైసెన్స్‌ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది ఎన్‌జీఓలు ఇప్పటికే పొడగింపులు అందుకున్నాయని అన్నారు. పిటిషనర్‌ అమెరికాలోని హ్యూస్టన్‌కు చెందిన ఓ వ్యక్తి అంటూ నొక్కి చెప్పారు. తాజా పిటిషన్‌తో ఎలాంటి ప్రయోజనం పొందాలనుకుంటున్నారో తెలియడం లేదని మెహతా చెప్పుకొచ్చారు. కానీ ఏదో తప్పు ఉందని తెలిపారు. అయితే తదుపరి విచారణ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మరో ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణల కేసులో తీర్పు వెలువడిన తరువాత అది జరుగుతుందని కోర్టు తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement